ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!

November 7, 2021 at 8:52 am

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన ఈ భామ‌.. ప్ర‌స్తుతం వ‌రుస ఆఫ‌ర్ల‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు స‌ర‌స‌న స‌ర్కారు వారి పాట‌, చిరంజీవికి చెల్లెలుగా `భోళ శంక‌ర్‌`, నానికి జోడీగా `ద‌స‌రా` చిత్రాలు చేస్తున్న కీర్తి సురేష్‌.. మ‌రోవైపు త‌మిళ్‌, మ‌ల‌యాళ చిత్రాల్లోనూ న‌టిస్తోంది.

Keerthy Suresh: New incarnation as a business tycoon: Actress Keerthi Suresh who started a company called 'Bhoomitra'! - actress keerthy suresh started bhoomitra skin care products business » Jsnewstimes

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌రో స్టార్ హీరో మూవీ నుంచి కీర్తి బంప‌ర్ ఆఫ‌ర్ అందుకుంద‌ట. ఇంత‌కీ ఆ స్టార్ హీరో ఎవ‌రో కాదు అల్లు అర్జున్‌. ప్ర‌స్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్‌.. ఆ త‌ర్వాత బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది.

Keerthy Suresh bags Allu Arjun's bilingual

అయితే ఈ చిత్రంలో బ‌న్నీకి జోడీగా కీర్తి సురేష్‌ను ఎంపిక్ చేశార‌ని.. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు సైతం పూర్తి అయ్యాయని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

ఫుల్ జోష్‌లో కీర్తి సురేష్‌..ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్‌?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts