ఇలియానాకు ఎంత క‌ష్టమొచ్చింది..అందుకు అబ్బాయే దొర‌క‌డం లేద‌ట‌!

ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన గోవా బ్యూటీ.. ఇక్క‌డ మంచి స్టార్డమ్ ఉండ‌గానే బాలీవుడ్‌కి చెక్కేసి అక్క‌డ కెరీర్‌ను ఘోరంగా విఫ‌లం చేసుకుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్‌కి వ‌చ్చినా.. ఇలియానాను ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

Rumour has it: Is Raid actress Ileana D'Cruz pregnant? Picture shared by beau Andrew Kneebone sparks speculations

ప్ర‌స్తుతం అడ‌పాత‌డ‌పా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని ఆమె అభిమానులు ఎప్ప‌టి నుంచో వెయిట్ చేస్తున్నారు. అయితే పెళ్లికి ఇలియానా సిద్ధంగానే ఉంద‌ట‌.. కానీ, పాపం ఆమెకు అబ్బాయే దొర‌క‌డం లేద‌ట‌. ఈ విష‌యం ఎవ‌రో కాదు.. స్వ‌యంగా ఇలియానానే తెలిపింది.

Ileana D'Cruz: I cherish what I had with Andrew and look back at it with a smile | Hindi Movie News - Times of India

తాజాగా ఓ నెటిజ‌న్ మీ పెళ్లెప్పుడు? అని ప్ర‌శ్నించ‌గా.. అందుకు ఇలియానా `నాకూ చేసుకోవాలని ఉంది. అయితే ఎంత వెతికినా వరుడు దొరకడంలేదు` అని స‌మాధానం ఇచ్చింది. మ‌రి ఇలియానాకు న‌చ్చే వ‌రుడు ఎప్పుడు దొరుకుతాడో ఏమో. కాగా, గతంలో ఆండ్రూ అనే వ్యక్తితో ఇలియానా ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. కానీ, ప‌లు కార‌ణాల వీరిద్ద‌రూ విడిపోయారు.