పుష్ప కోసం బన్నీ అలా చేస్తున్నాడా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ కోసం యావత్ మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్‌గా సుకుమార్ తనదైన మార్క్‌తో తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అదిరిపోయే అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ ఊరమాస్ లుక్‌తో ఇప్పటికే ఎలాంటి ట్రీట్ ఇచ్చాడో అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతుండగా, ఈ సినిమాకు సంబంధించి మూడు భాషల్లో బన్నీ తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా బన్నీనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడట. ఇక తమిళం లేదా కన్నడలో కూడా బన్నీ తన గొంతును వినిపిస్తాడని తెలుస్తోంది.

నిజంగా ఓ స్టార్ హీరో ఇలా తన పాన్ ఇండియా చిత్రం కోసం ఏకంగా మూడు భాషల్లో సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషమనే చెప్పాలి. ఈ సినిమాను ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు.