రొమాంటిక్ సినిమా కి ఎంత నష్టమో తెలుసా..!

ఆకాష్ పూరి, హీరోయిన్ కేతికశర్మ జంటగా నటించిన చిత్రం రొమాంటిక్. ఈ సినిమాకి అనిల్ పాదూరి డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాని పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, చార్మిలు కలసి సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజే యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.మొదటి రోజే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఆ తర్వాత జోరు చూపించలేకపోయింది ఈ సినిమా.

ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-1.37 కోట్లు.
2). సీడెడ్-79 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-52లక్షలు.
4). గుంటూరు-32 లక్షలు.
5). ఈస్ట్-30 లక్షలు.
6). వెస్ట్-21 లక్షలు.
7). కృష్ణ-29లక్షలు.
8). నెల్లూరు-20 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్ల విషయానికి వస్తే..4 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ప్రపంచవ్యాప్తంగా 4.18 కోట్ల రూపాయలను వసూలు చేసింది.

ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..4.68 కోట్లు జరగగా. ఈచిత్రం ముగిసే సమయానికి..4.18 కోట్ల రూపాయలను దీంతో బయ్యర్లకు 62 లక్షల నష్టాన్ని మిగిల్చింది.