వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఏమిటంటే?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను తీసుకు వస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వాట్సాప్ ప్రైవసీ కి సంబంధించి ఎన్నో రకాల అప్డేట్స్ తీసుకొచ్చారు. ఇక తాజాగా వినియోగదారుల ప్రైవసీ సంబంధించి మరొక అడుగు ముందుకేసింది. ఇందులో ప్రొఫైల్ ఫోటో ప్రైవసీ సెట్టింగ్ లో వాట్సాప్ మార్పులు తీసుకు వచ్చినట్లు సమాచారం.ఈ సరికొత్త ఫ్యూచర్ వల్ల మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ ను ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు అన్నది మీరే నియంత్రించుకోవచ్చు.

మనము ఎవరు అయితే చూడకూడదు అనుకుంటున్నామో ఆ వ్యక్తులకు కనిపించకుండా నా ప్రొఫైల్ పిక్చర్ ని గోప్యంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం కస్టమ్ ప్రైవసీ సెట్టింగ్స్ లో ఇప్పటికే ఉన్నల్ every one.. My contacts..no body.. ఆప్షన్ల కి తోడుగా my contacts except ఆప్షన్ ను వాట్సాప్ జోడించనుంది. దీంతో మీరు పెట్టుకున్న ప్రొఫైల్ ఫోటోను వద్దనుకుంటున్నా వ్యక్తులను చూడకుండా జాగ్రత్తపడవచ్చు. అలాగే వాట్సాప్ లో లాస్ట్ సీన్, అబౌట్ స్టేటస్ సెట్టింగ్స్ లో కూడా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం వాట్సాప్ కి కొత్త ప్రొఫైల్ ఫోటో ప్రైవసీ సెట్టింగ్ పనిచేస్తుందట.