మనసులోని బాధను బయట పెట్టిన సమంత?

October 8, 2021 at 12:20 pm

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అలాగే ఆమెకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో మన అందరికి తెలిసిందే. ఈమె నిత్యం సోషల్ మీడియాలోయాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల ఈమె తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత ఈమె సోషల్ మీడియా అకౌంట్ లో పై అభిమానులు మరింత ఫోకస్ పెట్టారు. విడాకుల అనంతరం ఈమె ఏ పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక తాజాగా సమంత తన మనసులో ఉన్న బాధను పంచుకుంది.

ఎప్పుడూ మహిళలనే ప్రశ్నించే ఈ సమాజం మగవాళ్ళను మాత్రం ఎప్పుడూ ప్రశ్నించదు.. అలాంటప్పుడు మనం ప్రాథమికంగా నైతికత లేనట్లే అంటూ ఒక కొటేషన్ ని ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. విడాకులు అనంతరం సమంతదే తప్పు అంటూ కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్స్ చేస్తున్నారు. మరొకవైపు ఆమె స్టైలిస్ట్ ప్రీతం ను కూడా దారుణంగా రోల్స్ చేస్తూ అతడిపై నిందలు వేస్తున్నారు. అయితే ఇప్పటికే సమంత చైతన్య విడాకులు వ్యవహారంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్న ట్లు ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక యాడ్ షూటింగ్ లో పాల్గొన్న ఆమె కంటతడి పెట్టుకున్న ట్లు సమాచారం.

మనసులోని బాధను బయట పెట్టిన సమంత?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts