టీడీపీకి గంటా శ్రీనివాసరావు.. బై..బై..!

ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతలు చాలామంది వారి పేరు చెబితే చాలు ఆ రాజకీయ పార్టీ పేరు టక్కున తెలియజేస్తారు. అలాంటి వారిలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకరు.ఆయన ఏ పార్టీలొ నిలబడిన ఆయన గెలుపు ఖాయం అని చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు ఆయన రాజకీయ ప్రయాణాన్ని చూస్తే అటు కాంగ్రెస్ ప్రజారాజ్యం తెలుగుదేశం ఇలా ఏ పార్టీలో చేరిన ఆయన వరకు ఆయన ఎన్నికలలో గెలుస్తూ ఉండడం విశేషం.

ఇక 2019 సంవత్సరంలో ఏపీ అధికార పార్టీ టిడిపి దారుణంగా ఓడిపోయినప్పటికీ ఇదంతా మాత్రం చాలా సులువుగా విజయాన్ని సాధించాడు. గంటా శ్రీనివాసరావు ఉన్న మరొక బలహీనత ఏమిటంటే.. ఆయన అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళతారనే టాక్.. కాకుంటే జగన్ విషయంలో ఆయన లెక్కలు కాస్త ఫెయిల్యూర్ అయ్యాయి అని చెప్పవచ్చు.

జగన్ సీఎం అయ్యాక ఆయన వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సత్ఫలితాన్ని ఇచ్చాయి. ఒకవేళ గంటా ను పార్టీలోకి ఆహ్వానిస్తే ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందని భావనతోనే ఆయనను పార్టీలోకి చేర్చుకోవడానికి ఇష్టపడకూడదు అన్నట్లుగా నాచారం.

ఇక ఇదంతా ఇలా ఉండగా తాజాగా టిడిపికి సైతం ఆయన గుడ్ బై చెబుతూ రాజీనామాలు చేశారని సమాచారం. అయితే గంటా శ్రీనివాస ఈసారి ఎన్నికల్లో ఎటువైపు నిలబెడతాడు అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న ప్రకారం జనసేన లోకి ఎంట్రీ ఇస్తారని అని అనుకుంటున్నారు. కానీ జనసేన పార్టీలోకి ఈయనను తీసుకొని ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుగా సమాచారం. అయితే ఈయన జనసేనలోకి వెళతాడా వెళ్లడం అనే విషయం మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.