`8`తో రీఎంట్రీ ఇస్తున్న‌ స్నేహా ఉల్లాల్..స‌క్సెస్ అవుతందా?

స్నేహా ఉల్లాల్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను మీకు తెలుసా` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్నేహా ఉల్లాల్‌.. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన ఈ బ్యూటీ.. గ‌త ఏడేళ్ల నుంచీ స్క్రీన్ మీదే క‌నిపించ‌లేదు.

Salman Khan's 'Lucky' heroine Sneha Ullal to make her digital debut; Read full details

ఏవో అనారోగ్య స‌మ‌స్య కార‌ణంగా ఈ భామ వెండితెర‌కు దూరమైంది. అయితే మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు స్నేహా ఉల్లాల్ రీ ఎంట్రీ ఇస్తోంది. కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తున్న `ఎయిట్‌` మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ.. మేక‌ర్స్ స్నేహా ఉల్లాల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Sneha Ullal : తెలుగులో రీఎంట్రీ ఇస్తున్న పిల్లి కళ్ళ పాప.. | Snehaullal re entry in telugu

మరి చాలాకాలం తర్వాత తో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న స్నేహ ఉల్లాల్ ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. కాగా, సినిమా విష‌యానికి వ‌స్తే..రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సూర్యాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బహుభాషా చిత్రంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది.