కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. స్పెష‌ల్ పోస్ట‌ర్‌తో `స‌ర్కారు..` టీమ్ విషెస్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మ‌హాన‌టి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `స‌ర్కారు వారి పాట‌` ఒక‌టి. మ‌హేష్ బాబు హీరోగా ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానుంది.

Sarkaru Vaari Paata: Mahesh Babu Reveals The First Look And Release Date Of Parasuram Directorial - Sacnilk

మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. అయితే నేడు కీర్తి సురేష్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా స‌ర్కారు వారి పాట టీమ్‌.. ఓ స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి కీర్తికి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

Mahesh Babu and Keerthy Suresh look perfect in new Sarkaru Vaari Paata still. Seen yet? - Movies News

ఈ తాజా పోస్ట‌ర్‌లో ట్రెండీ డ్ర‌స్ ధ‌రించిన కీర్తి చిరు న‌వ్వులు చిందిస్తూ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఆక‌ట్టుకుంటున్న ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, రజనీకాంత్ నటిస్తున్న అన్నాథే (తెలుగులో పెద్దన్న) మ‌రియు చిరంజీవి న‌టిస్తున్న భోళాశంకర్ చిత్రాల్లో కీర్తి కీల‌క పాత్రలు పోషిస్తోంది. మ‌రిన్ని ప్రాజెక్ట్స్ కూడా కీర్తి చేతిలో ఉన్నాయి.

https://twitter.com/GMBents/status/1449595552480391173?s=20