చైతన్య – సమంత బాటలో మరొక టాప్ డైరెక్టర్..!!

ఈ మధ్యకాలంలో ఎక్కువగా సౌత్ సెలబ్రిటీలు కూడా విడాకుల విషయంలో మొహమాటం లేకుండా ఉంటున్నారు. భాగస్వామితో కలిసి ఉండలేం అనుకుంటే కచ్చితంగా బ్రేకప్ చెప్పేస్తున్నారు. అందుకు ఉదాహరణ నాగచైతన్య సమంతల విడాకుల విషయం తీసుకోవచ్చు. వీరు విడాకులకు ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో మరొక సెలబ్రెటీ జంట కూడా విడాకులకు సిద్ధమైన వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్కు చెందిన ఒక యంగ్ డైరెక్టర్ తన భార్యకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక డైరెక్టర్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆమె తో ఉండడం లేదన్నట్లుగా సమాచారం. ఒక డైరెక్టర్ టాలీవుడ్ కెరియర్ ప్రారంభంలో మంచి సినిమాలు చేసి సక్సెస్ను అందుకున్నప్పటికి.. ఆ తరువాత అతడు ఎక్కువ సినిమాలు చేయలేకపోయాడు.

ఇక ఈ సమయంలోనే విడాకులు అతడి కెరియర్ పై ప్రభావం పడేందుకు అవకాశాలు ఉన్నాయ్ అని వ్యక్తం అవుతున్నాయి. విడాకుల వల్ల తన వ్యక్తిగత జీవితం పై నే కాకుండా కెరియర్ పై కూడా ప్రభావం పడుతోంది. ఇంతకీ వారు ఎవరో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.