సమంత కొత్త కండిషన్లు తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

సాధారణంగా హీరోయిన్లు దర్శక నిర్మాతలకు తమ సినిమాలలో నటించాలని అంటే కొన్ని కండిషన్లు పెడుతున్నారని వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే నయనతార లాంటి స్టార్ సీనియర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాలని పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా విడాకుల తర్వాత సరికొత్త షరతులను పెడుతోందనే వార్తలు సినీ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి.

సమంత ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే..ఇందులో ఓ తమిళ అగ్ర బ్యానర్ సహా శ్రీదేవి మూవీస్ బ్యానర్ కూడా ఉంది. అయితే షూటింగుకి వెళ్లాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయని నిర్మాతలకు సమంత చెబుతున్నారని గుసగుసలు వైరల్ అవుతున్నాయి. విడాకుల తరువాత సమంత తన తదుపరి చిత్రాల నిర్మాతలకు కొత్త షరతులు పెడుతోంది. షూటింగ్ ల కోసం మెజారిటీ పార్ట్ చెన్నై లేదా ఆ చుట్టుపక్కల లొకేషన్లను ఎంచుకోవాలని సమంత దర్శకనిర్మాతలను కోరుతున్నారట.

హైదరాబాద్ లో షూటింగులు చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ఒకవేళ హైదరాబాదులో తప్పనిసరిగా చిత్రీకరించాలనుకుంటే కేవలం ఇండోర్ మాత్రమే ప్లాన్ చేయాలి. ఇండోర్ లొకేషన్లు సెట్లలో షూట్ చేయాలి. సమంత ఆరుబయట షూట్ చేసే మూడ్ లో లేదు. ప్రత్యేకించి ఈ కండీషన్ ని నొక్కి చెబుతోందట. అయితే సమంతా కండిషన్స్ ను దర్శకనిర్మాతలు యాక్సెప్ట్ చేస్తారో లేదో వేచి చూడాల్సిందే..