కీర్తి సురేష్ తల్లి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?

మహానటి సినిమాతో జాతీయ అవార్డు గుర్తింపు పొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ రోజున తన 29 వ పుట్టినరోజు సందర్భంగా ఈమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది నటి కీర్తి సురేష్. 1992 అక్టోబర్ 17న సురేష్ మేనక దంపతులకు జన్మించింది ఈ ముద్దుగుమ్మ.ఈమె తండ్రి మలయాళంలో ఒక పెద్ద నిర్మాత, తల్లి మేనక కూడా మలయాళంలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్.అంతే కాకుండా చిరంజీవితో కలిసి పున్నమినాగు సినిమా మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.

ఇక ఇంట్లో ఉండే వారంతా సినీ ఇండస్ట్రీ సంబంధించిన వారే సినీరంగంలోకి అడుగు పెట్టడానికి చాలా సులువు అయ్యింది.మొదటిసారిగా 2013వ సంవత్సరంలో ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన గీతాంజలి మూవీలో మొదటిసారిగా నటించింది. మొదటిసారిగా రేమో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగు వేస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటివారితో నటించే అవకాశం కూడా దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమాలో కూడా నటిస్తోంది.ఇక అంతే కాకుండా చిరంజీవి ఈ సినిమాలో చెల్లెలి పాత్రలో నటిస్తోంది.