రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం `స్పిరిట్`. టీ సీరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితంకానున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ, మండరిన్, జపనీస్, కొరియా భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
అలాగే ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ప్రభాస్‌కు విలన్‌గా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తోందట. కథను మలుపుతిప్పే కీలకమైన పాత్ర ఆమెదని, ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం.
అంతేకాదు, ఇప్పటికే కరీనాతో మేకర్స్ సంప్రదింపులు కూడా పూర్తి చేశారని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే.. అధికారిక ప్రకటన రావాల్సిందే. కాగా, ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ మరియు ప్రాజెక్ట్ కె చిత్రాలు చేస్తున్నాడు. ఇవి పూర్తి అయిన వెంటనే స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.