నెపోటిజంపై దగ్గుబాటి రానా సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీలో గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతి పై బాగా చర్చ జరిగింది. అయితే తాజాగా హీరో రానా దగ్గుబాటి బంధుప్రీతి పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇటీవల ఒక దేశాన్ని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ.. నిర్వచనం ప్రకారం నెపోటిజం అంటే రాజకీయ రంగం లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. వినోద ప్రపంచం కళలపై పై ఆధారపడి ఉంటుంది.

దీనికి ప్రేమ కుటుంబానికి చెందిన వారా లేదా అనే తేడా ఉండదు, టాలెంట్ ను ఎవరు ఎంత కృషి చేస్తున్నారు అనేది ట్యాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు అని దగ్గుబాటి రానా అన్నారు. రానా ఇండస్ట్రీకి పరిచయం అయినప్పుడు అతనికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. కానీ రానా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి గట్టిగానే కష్టపడాల్సి వచ్చింది. అలా ఎన్నో కష్టాలను అధిగమిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పారుచుకున్నాడు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కలిసి భీమ్లా నాయక్ సినిమాలో నటిస్తున్నాడు.