స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్న సితార.. ఎవరితో అంటే?

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ స్టార్ కిడ్ ఎప్పుడెప్పుడు సినిమాలకు ఎంట్రీ ఇస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ కూతురు అర్హ కానీ ఇండియా మూవీ అయినా శాకుంతలం ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కాబోతోంది. దీనితో మహేష్ బాబు అభిమానులు సీతార ను కూడా వెండితెరపై చూడాలి అన్న ఆత్రుత ఎక్కువ అయిపోయింది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

అదేమిటంటే ఒక స్టార్ హీరో సినిమా ద్వారా సితార వెండి తెరకు ఎంట్రీ ఖరారు అయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ 26న తలపతి విజయ్ 66 సినిమా అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ బెస్ట్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం విజయ్ తన 66 వ సినిమాను ప్రారంభించనున్నారు. ఇందులో ఒక పాత్ర కోసం సీతార ను సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి.