రాధేశ్యామ్ సినిమా బడ్జెట్ వడ్డీ భారమే ఎన్ని కోట్లో తెలుసా..?

హీరోల సినిమా నిర్మాణం అంటే కోట్ల ఖర్చుతో చేయవలసి వస్తోంది. ఇక భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR మూవీ నిర్మాత దానయ్య ఫైనాన్స్ మీద నిర్మించారనే సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా. ఈ సినిమా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది.

అయితే ఈ సినిమా నిర్మాతలకు వడ్డీ భారమే దాదాపుగా 60 కోట్ల రూపాయలకు పైగా పడినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. కానీ ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు నిర్మాతలు. ఇక ఈ సినిమాకి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే మాత్రం సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నది.

ఇక ఈ సినిమా ట్రైలర్ విడుదల కాక ఈ సినిమాలో ప్రభాస్ కొత్త తరహా పాత్రలో కనిపిస్తున్నారు. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ఈ సినిమా కచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుందాం.