నాగబాబు వేసిన పంచ్ కి.. మంచు విష్ణు రీయాక్షన్ ఇదే..!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు కేవలం కొన్ని గంటల్లోనే జరగనున్నాయి. ఎన్నికల విజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టడానికి మంచు విష్ణు ఎంతో శ్రమిస్తున్నారు. ప్రకాష్ రాజ్ గురించి కూడా తరచూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా నాగబాబు విష్ణు గురించి కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్ పై మంచు విష్ణు వేగంగా స్పందించారు.

తన ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారిని క్షమించనని విష్ణు తెలియజేశారు. నాగబాబు,పవన్ కళ్యాణ్ కు కోపం”వస్తే వార్ వన్ సైడ్”అవుతుందని కామెంట్ చేశారు. ఈ డైలాగ్ తన సినిమాల్లో పెట్టుకుంటానని విష్ణు చెప్పుకొచ్చారు. తనకు పోటీగా నిలిచిన వ్యక్తి తెలుగు వ్యక్తి కాదని టాలీవుడ్ లో ఉండే సమస్యలను పరిష్కరించుకోవడం మాకు తెలుసు అని తెలియజేశాడు.

ప్రకాష్ రాజు కూడా తనపై తమ ఫ్యామిలీపై ఎన్నో కామెంట్లు చేస్తున్నప్పటికీ ఇక్కడి వాడు కాదని ఉద్దేశంతోనే ఆయన క్షమించి వదిలేశానని తెలియజేశారు విష్ణు.తాజాగా చాలెంజ్ చేస్తున్నాను ప్రకాష్ రాజ్ తన ఫ్యామిలీ పై కామెంట్ చేస్తే నేను ఏంటో చూపిస్తానని అంటున్నారు. నాన్నకు పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. వకిల్ సాబ్ సినిమా విడుదలైనప్పుడు పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి నాన్న ప్రశంసించారని తెలియజేశాడు. దాంతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశాడు అన్నారు చెప్పుకొచ్చాడు. మెగా ఫ్యామిలీ లో ఉండే హీరోలు కూడా తనకు మంచి స్నేహితులని తెలియజేయడం విశేషం.