ఆరడుగుల బుల్లెట్ సినిమా కలెక్షన్ ఎంతో తెలుసా..!

గోపీచంద్ హీరోగా నయనతార హీరోయిన్ గా బి. గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ఆరడుగుల బుల్లెట్. ఇక ఈ సినిమా ఎన్నో సంవత్సరాల నుంచి విడుదల కాక ఇబ్బంది పడుతుంటే ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 8వ తేదీన విడుదలైంది. అయితే ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో ఇప్పుడు చూద్దాం.

ఇక కలెక్షన్ల వివరాలను చూస్తే..
1). నైజాం-12 లక్షలు.
2). సీడెడ్-8 లక్షలు.
3). ఉత్తరాంధ్ర-9 లక్షలు.
4). ఈస్ట్-4 లక్షలు.
5). వెస్ట్-3 లక్షలు.
6). కృష్ణ-6 లక్షలు.
7). గుంటూరు-7 లక్షలు.
8). నెల్లూరు-3 లక్షలు.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్లు..52 లక్షలు.
రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్..5 లక్షలు.

వరల్డ్ వైడ్ గా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..57 లక్షలు.

ఇక ఈ సినిమా థియేటర్ బిజినెస్ విషయానికొస్తే..2.95 కోట్ల రూపాయలు జరగగా ఇప్పటివరకు..57 లక్షల రూపాయలను మాత్రమే రాబట్టింది. ఇంకా ఈ సినిమా 2.38 కోట్ల రూపాయలను రాబడితే సక్సెస్ అయినట్లే. అయితే అంత డబ్బులు రాబడుతుందని విషయంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.