మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసిన సినీ ఇండ‌స్ట్రీ..ఎందుకో తెలుసా?

మీరా జాస్మిన్‌.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అమ్మాయి బాగుంది` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. చాలా త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ర‌వితేజ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బాల‌కృష్ణ‌, గోపీచంద్‌, రాజ‌శేక‌ర్ వంటి స్టార్ హీరోల‌తో స్క్రీన్ షేర్ చేసుకుని.. ఎన్నో హిట్ చిత్రాల‌ను త‌న ఖాతాలో వేసుకుంది.

Castration only way to deal with those sexually assaulting women: Meera Jasmine | Deccan Herald

కొంచం బొద్దుగున్నా.. పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగదీస్తోంది అన్న పేరుంది. ఒకానొక సమయంలో సౌత్ లో మరో సౌందర్య గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక‌ తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా న‌టించిన మీరా జాస్మిన్.. ఎక్కువ కాలం సినీ ప్ర‌రిశ్ర‌మ‌లో నిల‌దొక్కుకోలేక‌పోయింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు అనూహ్యంగా తన ప్రవర్తనతో మలయాళ సినీ పెద్దల నుండి బహిష్కరణ వేటు వేయించుకుంది.

A Complete List of Meera Jasmine Hindi Dubbed Movies - MovieNasha

మలయాళ దర్శకులు, నిర్మాతలకు వ్యతిరేకంగా ఎన్నోసార్లు మాట్లాడిందన్న కారణంగా మాలీవుడ్ ఇండ‌స్ట్రీ మీరా జాస్మిన్‌ను బ్యాన్ చేసింది. దాంతో మీరా జాన్మిన్ వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మార‌గా.. ఆమెకు మెల్ల మెల్ల‌గా అవ‌కాశాలు కూడా త‌గ్గాయి. ఇక 2014లో దుబాయ్ కు చెందిన అనిల్ జాన్ అనే ఇంజనీర్‌ని వివాహం చేసుకున్న మీరా.. కొంత కాలానికి అత‌డితో విడిపోయి వేరు కుంప‌టి పెట్టింది. ప్ర‌స్తుతం ఈ భామ మ‌ళ్లీ టాలీవుడ్‌లో సెకెండ్ ఇన్నింగ్స్‌ స్టార్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంద‌ని టాక్‌.