ఛార్మీ వెంట‌ప‌డి ప్రేమించినా రిజెక్ట్ చేసిన అబ్బాయి ఎవ‌రో తెలుసా?

అందాల భామ ఛార్మీ కౌర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నీతోడు కావాలి` అనే సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఛార్మీ.. శ్రీ ఆంజనేయం సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా.. అంద‌చందాల‌తో కుర్ర‌కారుకు చెమ‌ట‌లు ప‌ట్టించి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.

Charmme Kaur bids adieu to acting career - Movies News

మ‌రోవైపు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేసిన ఛార్మీ.. గ‌త కొంత కాలం నుంచి న‌ట‌న‌కు దూర‌మై నిర్మాత‌గా సెటిల్ అయింది. ఇక మూడు ప‌దుల వ‌య‌సులోనూ పెళ్లిపై ఇంట్ర‌స్ట్ లేద‌ని చెబుతున్న ఛార్మీ.. స్కూల్లో చదువుకునే రోజుల్లోనే ప్రేమలో పడింద‌ని మీకు తెలుసా..? అవును, ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది.

Exact reason behind Charmee Kaur not getting married

స్కూల్లో చదువుకునే రోజుల్లోనే పంజాబీ అమ్మాయి అయిన ఛార్మీ మరో పంజాబీ అబ్బాయిని గాఢంగా ప్రేమించింద‌ట‌. ఇక ఆ అబ్బాయిని ఇంప్రెస్ చేసేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింద‌ట‌. ఓ రోజు ల‌వ్ లెట‌ర్ కూడా రాసింది. కానీ, ఛార్మీ వెంట‌ప‌డి ఎంత ప్రేమించినా స‌ద‌రు పంజాబీ అబ్బాయి మాత్రం ఆమెను రిజెక్ట్ చేశాడట‌. దాంతో ఛార్మీది ఫ‌స్ట్ ల‌వ్‌నే వన్ సైడ్ లవ్‌గా మిగిలిపోయింది.