మైండ్ బ్లోయింగ్ గా ఉన్న రాధేశ్యామ్ టీజర్..?

ప్రభాస్ బర్త్ డే రోజుల నుంచి సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. అయితే ఈ రోజు ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సినిమాల అప్డేట్ రానే వస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ నుంచి అదిరిపోయే వీడియో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ చూసిన అభిమానులు ఈ సినిమా మీద భారీ అంచనాలు పెంచేస్తున్నారు.

గత కొన్ని నెలల నుంచి రాధేశ్యామ్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే అప్డేట్ ఆలస్యంగా ఇస్తున్నానని దర్శకుడు రాధాకృష్ణ నిర్మాత సంస్థ మీద ప్రభాస్ ఫాన్స్ ఎన్నిసార్లు ట్రోల్ చేశారు. కానీ వారు మాత్రం అభిమానుల అంచనాలు తగ్గట్టుగానే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా వదిలింది టీజర్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇక ఈ సినిమా లవ్, యాక్షన్ సీన్లతో కూడిన సినిమా గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో లవర్ బాయ్ గా ప్రభాస్ కనిపిస్తున్నాడు.