జాంబి రెడ్డి హీరో అద్భుతం సినిమా.. ఓటీటీ రైట్స్ ఎన్ని కోట్లు అంటే..?

ప్రస్తుతం ఉన్న యువ హీరోల సినిమాలకు ఓటీటీలు ఒక వరంలా మారాయి అని చెప్పుకోవచ్చు. హీరో తేజ సజ్జాకు ఇటీవల ఓటీటీ లో ఒక క్రేజీ ఆఫర్ దక్కింది. అద్భుతం సినిమాని ఓటీటీ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం ott శాటిలైట్ హక్కులు కూడా భారీ ఆఫర్ ను దక్కించుకుంది. ఈ సినిమా కి మల్లిక రామ్ డైరెక్షన్ వహించాడు. ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్గా నటించింది.

ఓటిటిలో ఒకటైన అటువంటి.. హాట్ స్టార్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం ఏడు కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. నిజానికి కరోనా వల్ల ఇప్పటికే ఈ సినిమా విడుదల ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా విడుదలకు ఇంత పెద్ద ఆఫర్ రావడం నిజంగానే ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతోంది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మొదలుపెట్టి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో తేజ సజ్జ. ఇక ఇప్పుడు తాజాగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు.