వివాదంలో చిక్కుకున్న ప్రముఖ హీరోయిన్ …?

దసరా కానుక గా విడుదలైన పెళ్లి సందD సినిమా ప్రస్తుతం హిట్ టాక్ తో విజయవంతం గా దూసుకెళ్తుంది. ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరియు హీరోయిన్ శ్రీ లీలా జంటగా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ శ్రీ లీలా ఓ వివాదం లో చిక్కుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త సూరపనేని శుభాకర్ రావు శ్రీ లీల తన కూతురే కాదని సంచలన వ్యాఖ్యాలు చేయడం వివాదానికి దారి తీసింది.

ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ .. పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీలా తన కుమార్తె కాదని, ఆమె తన మాజీ భార్య కు మాత్రమే కూతురు అని పేర్కొన్నారు. తాము విడిపోయిన తరువాత తన మాజీ భార్యకు శ్రీ లీలా పుట్టిందని, అంతే కాని శ్రీ లీలా తన సొంత కూతురు కాదని తెలిపారు. అయితే తన ఆస్తులపై క్లెయిమ్ చేయడానికే తన పేరు వాడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో మండి పడ్డారు. ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయని , ఈ విషయం పై న్యాయపరంగా హై కోర్టు నుంచి సుప్రీమ్ కోర్టు వరకూ వెళ్ళామని తెలిపారు.
ఏ ఆధారంతో సన్మాన సభలో శ్రీ లీలా తన కుమార్తె గా
ఎలా ప్రకటిస్తారని , ఈ విషయం పై సూరపనేని సొసైటీ కి కూడా కంప్లయింట్ చేశానని ఫైర్ అయ్యారు.