ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ అంటున్న కాజ‌ల్‌..ప్రెగ్నెన్సీ గురించేనా?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎంత మంది కొత్త హీరోయిన్లు వ‌చ్చి పోతున్నా.. కాజ‌ల్ మాత్రం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గానే కొన‌సాగుతూ వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. ఇక గ‌త ఏడాది ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడిన కాజ‌ల్‌.. వివాహం త‌ర్వాత కూడా ఆప‌ర్లు అందుకుంటూ కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తోంది.

Kajal Aggarwal to marry businessman Gautam Kitchlu? | Tamil Movie News - Times of India

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ భామ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టింది. `ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ఇవ్వబోతున్నా.. కాస్త వేచి ఉండండి` అని తన పోస్ట్‌లో చెబుతూ.. లవ్ సింబల్‌తో పాటు డాన్స్ చేస్తున్న ఏమోజీని జత చేసింది. దాంతో అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు.. కాజ‌ల్ చేయ‌బోయే ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ త‌న ప్రెగ్నెన్సీ గురించే అని భావిస్తున్నారు.

Kajal agarwal (@_Kajal_Agarwal) | Twitter

కాగా, గ‌త కొద్ది రోజులుగా కాజ‌ల్ ప్రెగ్నెంట్ అంటూ వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. కానీ, కాజ‌ల్ మాత్రం ఆ వార్త‌ల‌పై స్పందించ‌లేదు. ఇక తాజాగా ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ ప్ర‌క‌టిస్తాన‌ని కాజ‌ల్ అన‌డంతో..గర్భం గురించే అని అంటున్నారు. మ‌రి కాజ‌ల్ ప్రెగ్నెన్సీ విష‌య‌మేనా..? లేక ఇంకేదైనా విష‌యం చెబుతుందా..? అన్న‌ది తెలియాలంటే ఆమె నుంచి ప్ర‌క‌ట‌న రావాల్సిందే.