ఆ హీరోయిన్ తో లవ్ సీన్లు అంటే నరకమే.. హాలీవుడ్ హీరో?

హాలీవుడ్ హీరో స్టార్ జేక్ గైలెన్హల్ హీరోయిన్ జెన్నీఫర్ అనిస్టన్ తో కలిసి పనిచేయడం నరకమని అంటున్నాడు. వీరిద్దరూ 2002లో వచ్చిన ద గుడ్ గర్ల్ అనే ఒక సినిమాలో కలిసి నటించారు. ఇక తాజాగా జేక్ హోవార్డ్ స్టెర్న్ షోకి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఆనాటి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. జెన్నిఫర్ తో కలిసి పనిచేయడం టార్చర్ అని చెప్పుకొచ్చాడు. అయితే అందుకు గల కారణం ఆమె అంటే ఎంతో ఇష్టం ఉన్నా అతనికి తనతో కలసి లవ్ సీన్లలో నటించడం అంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టం గా ఉండేది అని అన్నాడు.

అంతేకాకుండా ఆ సినిమా షూటింగ్ సమయంలో చెప్పు 30 నుంచి 50 మంది వరకు మనల్ని చూస్తున్నప్పుడు లవ్ సీన్ ఇలాంటి సన్నివేశాల్లో నటించడం కాస్త ఇబ్బందిగా ఉండేదని తెలిపాడు.కొన్ని కొన్ని సమయాల్లో అయితే పిల్లో టెక్నిక్‌తో కొన్ని అభ్యంతరకరమైన సీన్లను ఎలాగో అలా షూట్‌ చేశామని చెప్పుకొచ్చాడు. ఇక ఇందులో మా ఇద్దరి మధ్యలో దిండు పెట్టాలి అన్న ఆలోచన కూడా జెన్నిఫర్‌దే నంటూ ఆ క్రెడిట్ అంతా కూడా ఆమెకే క్రెడిట్‌ ఇచ్చాడు. కాగా జేక్‌ కి జెన్నిఫర్‌ అంటే క్రష్‌ ఉంది అన్న విషయాన్ని 2016లో బయటపెట్టాడు. కొన్నేళ్లపాటు ఆమెను క్రష్‌గా ఆరాధించడమే కాక ఆమెతో కలిసి పనిచేసే అవకాశాన్ని కూడా కొట్టేశాడు.జెన్నిఫర్‌ ఆనిస్టన్‌ 2000వ సంవత్సరంలో నటుడు బ్రాడ్‌ పిట్‌ ను పెళ్లాడింది. 2005లో అతడికి విడాకులిచ్చేసిన అనంతరం జస్టిన్‌ థెరూక్స్‌తో కొత్త జీవితాన్ని ఆరంభించింది.