జేమ్స్ బాండ్ డేనియల్ క్రెగ్ కి అరుదైన గౌరవం..?

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాండ్ సిరీస్ లో అత్యధికంగా సినిమాలు చేసిన హీరోగా డేనియల్ క్రెగ్ రికార్డు సృష్టించడం కూడా జరిగింది. జేమ్స్బాండ్ సినిమాలో నటించిన యాక్టర్ కి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఇక అలాంటి డేనియల్‌ క్రెగ్ కి అరుదైన గౌరవం లభించింది. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ వాక్ ఆఫ్ ఫేమ్‌ స్టార్‌తో డేనియల్‌ని సత్కరించింది. లెజెండరీ బాండ్ నటుడు రోజర్ మూర్‌ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన 2,704 నటుడు ఇతనే.అయితే ఇప్పటి వరకు అయిదు బాండ్‌ సినిమాల్లో నటించిన డేనియల్‌కి తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’ చివరిది.

దీంతో తన టీంతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ 53 ఏళ్ల స్టార్‌ బాండ్‌ చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపాడు. వారు లేకుండా తాను అలాంటి అరుదైన గౌరవాన్ని పొందేవాన్ని కాదని చెప్పాడు. అయితే ఇటీవలే విడుదలైన 24 వ జేమ్స్‌ బాండ్ మూవీ ‘నో టైమ్ టు డై’ హాలీవుడ్‌లోనే కాకుండా ఇండియా లో కూడా మంచి వసూళ్లను సాధించింది. సందర్భంగా 2006లో క్యాసినో రాయల్‌ తో బ్రిటీష్‌ గూఢచారిగా ప్రస్థానం ప్రారంభించి సుదీర్ఘకాలం బాండ్‌ పాత్రలో జీవించిన డేనియల్‌కి అరుదైన గౌరవాన్ని ఇచ్చింది హాలీవుడ్‌.