దేవిశ్రీ ప్రసాద్ ప్రేమ‌లో ఛార్మి..పెళ్లి వ‌ర‌కు వెళ్లి ఎందుకు ఆగిపోయారు?

ఛార్మి కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొన్నాళ్ల పాటు చ‌క్రం తిప్పిన ఈ బ్యూటీ.. దాదాపు అగ్ర హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపోయింది. ప్ర‌స్తుతం న‌ట‌న‌కు దూరంగా ఉన్న ఛార్మి.. నిర్మాత‌గా రాణిస్తోంది. అయితే ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు 34 ఏళ్లు. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. పెళ్లి గురించి ఎవ‌రైనా ప్ర‌శ్నించినా.. ఇప్ప‌ట్లో చేసుకునే ప్ర‌స‌క్తే లేద‌ని చెప్పేస్తుంది.

Charmy Kaur: Deal set with Devi Sri Prasad .. Beautiful lady proceeding with the same idea! » Jsnewstimes

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఛార్మి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ప్రేమ‌లో ఉన్న‌ట్టు ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌చ్చాయి. పెళ్లి విష‌యంలో ఛార్మి, దేవిశ్రీ త‌ల్లిదండ్రులు కూడా చ‌ర్చించుకున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఇదిగో ఇంకెంత ఓ రెండు రోజుల్లో పెళ్లి అన్నట్లుగా హడావిడి జరిగింది. పైగా ఈ వార్త‌ల‌కు త‌గ్గ‌ట్టే ఛార్మి, దేవిలు చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిరిగేవారు.

Devi Sri Prasad Is Big Brother Of Charmi? | Charmi | DSP Brother Sagar |

దాంతో దేవి, ఛార్మి పెళ్లి ద్వారా ఒక్కటవుతారని అంద‌రూ భావించారు. కానీ, అంతలోనే ఛార్మి-దేవిల‌ మధ్య మనస్పర్ధలు త‌లెత్త‌డంతో.. పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే వీరి ప్రేమాయ‌ణానికి ఎండ్ కార్డు ప‌డింద‌ని టాక్‌. ప్ర‌స్తుతం దేవిశ్రీ ప్ర‌సాద్ వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతుంటే.. ఛార్మి డైరెక్ట‌ర్ పూరీతో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ ముంబైలో సెటిల్ అయింది.