స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్ ఆగిపోవడంతో తన భార్యతో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు. డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ ఆర్య, ఆర్య-2 సినిమాలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా ఆర్య-3 సినిమా కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ కాకుండా విజయ్ దేవరకొండ ని తీసుకున్నట్లుగా సమాచారం.
ఇక ఈ సినిమా స్టోరీ ని అల్లు అర్జున్ కి వినిపించగా.. లవ్ స్టోరీ అంటే పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడంతో ఈ సినిమా విజయ్ దేవరకొండ తో తెరకెక్కిస్తారని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా నిజమో కాదో తెలియాలంటే మాత్రం ఆ చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేయాలి.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమా లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ఆర్య 3 సినిమా పట్టాల మీదకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కథల ఎంపికలో మాత్రం విజయ్ దేవరకొండ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు అన్నట్లుగా సమాచారం.