మొగలిరేకులు సీరియల్ ద్వారా అందులోనే ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టు లో మొత్తం అంతా బాగా పాపులర్ అయ్యారు. ఇక అందులోని ఒక నటుడు పవిత్ర నాథ్ కూడా మనకి సుపరిచితమే. నాటికలో అతని పేరు దయ పాత్రలో నటించాడు. కానీ ఇతనికి నిజజీవితంలో ఎలాంటి దయ లేదన్నట్లుగా తను చేసే చీకటి వ్యవహారాన్ని చెప్పుకొచ్చింది ఈ నటుడి భార్య.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తోంది. 2009వ సంవత్సరంలో పవిత్ర నాతో తనకు వివాహం అయిందని అప్పటినుంచి అతను అమ్మాయిలంటే పిచ్చి అని చెప్పుకొచ్చింది. జాతకాల పేరుతో ఎంతో మంది అమ్మాయిలను నేరుగా ఇంటికి తీసుకు వచ్చేవాడని చెప్పుకొస్తోంది.
ఇక అంతే కాకుండా ఒక అమ్మాయితో ఎనిమిది సంవత్సరాలుగా ఉన్నాడు అన్నట్టుగా తెలిపింది.ప్రతి రోజు తాగి ఇంటికి వచ్చి టార్చర్ పెట్టే వాడని.. ఈ విషయాన్ని తమ అత్తమామలకు చెప్పగా.. తన కుమారుడితో కలిసి తనను తన్ని రోడ్డుమీదికి పడేశారు అంటూ వాపోతోంది ఆమె. తనకు జరిగిన ఈ దారుణాన్ని మరొకరికి జరగకుండా ఉండేందుకు తాను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తోంది.