అవకాశాల కోసం.. పని మనిషి గా మారిన జబర్దస్త్ కమెడియన్..?

బుల్లితెరపై ప్రముఖ హాస్య నటుడిగా గుర్తింపు పొందిన నటుడు చమ్మక్ చంద్ర. జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే ఈయన సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు ఇప్పుడు చూద్దాం.

చిన్నప్పుడు పోస్టర్లపై బాబు మోహన్, బ్రహ్మానందం వంటి పోస్టర్లు కనబడగానే సినిమాలకు వెళ్లిపోయారట చమ్మక్ చంద్ర. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. తన చిన్నతనంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు చాలా కష్టపడ్డాడు చమ్మక్ చంద్ర తెలియజేశాడు. తాను పదో తరగతి ఫెయిల్ అయిన సినిమాల పై ఇంట్రెస్ట్ తో హైదరాబాద్కి వచ్చానని తెలియజేశాడు.

అలా వచ్చి రెండు సంవత్సరాల పాటు ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నాను. అలా ధనరాజ్ కూడా పరిచయం అయ్యారు చెప్పుకొచ్చారు. అలా ఎక్కడికి వెళ్లాలో తెలియక ఫ్రెండ్స్ దగ్గర కొద్దిరోజులు కాలం గడిపాను అని తెలియజేశారు. ఇక ఈయన తో పాటే ఒక ఆర్టిస్టు ఉండేవారు. ఇక ఆయనకు పనిమనుషుల సేవ చేస్తూ ఇండస్ట్రీ గురించి తెలుసుకుంటూ నెమ్మదిగా పైకి వచ్చాను అని చెప్పుకొచ్చారు చమ్మక్ చంద్ర.

Chammak Chandra - Wikipedia

ఇక ఆ తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక రూం తీసుకుని చిన్నచిన్న గెటప్పులు తన జీవితాన్ని గడిపేవారు అని చెప్పుకొచ్చారు. అలా ఎన్నో బాధలు అనుభవించి ఇప్పుడు ఇలాంటి పొజిషన్లో ఉన్నానని చెప్పుకొచ్చాడు.