కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!

October 24, 2021 at 11:22 am

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఘోస్ట్‌` ఒక‌టి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో నాగ్‌కు జోడీగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంద‌ని ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు.

Nagarjuna's THE GHOST Movie Motion Teaser | Praveen Sattaru | MS entertainments - YouTube

కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల కాజ‌ల్ ఈ మూవీ నుంచి త‌ప్పుకుంది. దాంతో ఇప్పుడు ఆమె స్థానంలో హాట్ బ్యూటీ అమ‌లా పాల్‌ను రంగంలోకి దింపార‌ని స‌మాచారం. అంతేకాదు, ఈ సినిమాలో అమలాపాల్ మరియు నాగార్జున మధ్య రొమాన్స్ బాగా చూపించాలని వారి మధ్య ఒక లిప్ లాక్ సీన్‌ను పెట్టార‌ట డైరెక్ట‌ర్‌.

Amala Paul moves court to take action against ex-boyfriend Bhavninder Singh | Tamil Movie News - Times of India

అయితే అందుకు కూడా అమ‌లా పాల్‌ ఒప్పుకుంద‌ని తెలుస్తోంది. ఇక ప్ర‌స్తుతం హైదరాబాద్ ఫిలిం సిటీలో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతుండ‌గా.. నాగ్‌, అమ‌లా ఇద్ద‌రూ పాల్గొంటున్న‌ట్లు స‌మాచారం. కాగా, గ‌తంలో అమ‌లా పాల్ `దడ` సినిమాలో నాగ చైత‌న్య‌కు జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు కొడుకు హీరోయిన్‌తోనే నాగ్ రొమాన్స్‌కు సిద్ధమ‌వ‌డం గ‌మ‌న్నార్హం.

కొడుకు హీరోయిన్‌తో నాగార్జున రొమాన్స్‌..?!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts