బిగ్‌బాస్ రెమ్యునరేష్‌ని ఉమాదేవి ఏం చేసిందో తెలుసా..అస్స‌లు ఊహించ‌రు!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మూడో వారం కొన‌సాగుతోంది. ఎన్నో ఆశ‌ల‌తో హౌస్‌లోకి అడుగు పెట్టిన అర్థపావు భాగ్యం అదేనండీ మ‌న కార్తీక దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమాదేవి రెండో వార‌మే ఎనిమినేట్ అయిపోయింది. తొలి వారం నుంచి చాలా అగ్రిసివ్‌గా ఉన్న ఉమ.. రెండో వారం నామినేషన్స్ స‌మ‌యంలో బూతు ఇంటి స‌భ్యుల‌కు, ప్రేక్ష‌కుల‌ను ఇబ్బంది అనిపించింది.

Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్‌తో ఎంట్రీని లీక్ చేసిన కార్తీకదీపం  భాగ్యం..?

ఆ తరవాత ఆమెకు బిగ్ బాస్ ఫుల్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఆమెను చాలావరకూ పాజిటివ్‌గా చూపించే ప్రయత్నం చేశారు. కానీ, నామినేషన్స్‌లోకి వచ్చిన తొలి రెండురోజుల్లోనే ఆమెకు నెగిటివ్‌గా చాలా ఓట్లు పడ్డాయి. దాంతో ఎవ‌రూ ఆమెను కాపాడ‌లేక‌పోయారు. ఫ‌లితంగా రెండో వార‌మే బ్యాగ్ స‌ద్దేసింది. అయితే హౌస్‌లో ఉన్న‌న్ని రోజులు త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో నెటిజ‌న్ల చేత తిట్టించుకున్న ఉమా.. ఇప్పుడు బ‌య‌ట ఉండి అదే నెటిజ‌న్ల చేత ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

Uma Devi Evicted from Bigg Boss 5 Telugu

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో రెండు వారాలు ఉండి రెండు ల‌క్ష‌ల‌కు పైగా రెమ్యూన‌రేష‌న్‌ను అందుకున్న ఉమా ఆ డ‌బ్బును ఏం చేసిందో తెలుసా..? తనకు వచ్చిన పారితోష‌కంలో కొంత మొత్తాన్ని బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారిని ఆదుకునేందుకు ఖ‌ర్చు చేసింద‌ట‌. ఇక ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు ఉమాదేవిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అంతేకాదు, ఆమెకు మరోసారి హౌస్ లో వెళ్లడానికి బిగ్ బాస్ అవకాశం కల్పించాలని కోరుతున్నారు.