కమెడియన్ ఆలీ సినీ ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు తెలుసా..?

సినీ ఇండస్ట్రీ లోకి చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు కమెడియన్ ఆలీ. అలా అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆలి ప్రేమ ఖైదీ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఒక ఇంటర్వ్యూలో ఆలీకు సంబంధించి కొన్ని విషయాలను తెలియజేశాడు వాటిని చూద్దాం.

అలీ సినీ ఇండస్ట్రీలో నటించడానికి కి మద్రాసు కు వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలను అనుభవించాను.. ఆ కష్టాలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న హైదరాబాదులో కష్టాలు చాలా తక్కువే అని తెలియ చేశాడు ఆలీ. అప్పట్లో ఆలీ దగ్గర డబ్బులు లేకపోయేసరికి ఆరు నెలల వరకు.. కేవలం టీ, బన్ను లనే తింటూ బతికే వాడట.తనకి ప్రేమఖైదీ సినిమాలో అవకాశం రావడంతో హైదరాబాద్ షూటింగ్ కోసం రావాలని తన చిన్ననాటి స్నేహితుడు తెలియజేయడంతో ఆలి అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడట.

కానీ తాను ఎక్కాల్సిన రైలు మిస్ అవడంతో వేరొక ట్రైన్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ కి వెళుతుండగా మధ్య మార్గంలో ట్రైను ఆగిపోయింది. సినిమా షూటింగ్ లేట్ అవుతుందని ఉద్దేశంతోనే ఆలీ తను రైలు పట్టాల మీద రెండు కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లాలని తెలియజేశాడు.

అలా నడుచుకుంటు కనపరిచిన ప్రతివారిని ఫిలిం నగర్ కు దారి అడుగుతూ వెళ్లానని చెప్పుకొచ్చాడు.