తినడానికి తిండి లేని సమయంలో ఎస్వీఆర్ ను ఆదుకున్న స్టార్ హీరోయిన్..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎస్వీ రంగారావు పాత్ర అమోఘమైనది . అయితే ఈయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో తినడానికి తిండి కూడా లేక, చెన్నై లో ఎన్నో అవస్థలు పడ్డారు. చాలా కోసం ఒక ప్రెస్ లోకి వెళ్ళిన ఈయన అక్కడ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తిరిగి పడుకోవడానికి నేలపైన పేపర్లు వేసుకొని నిద్రించే వాడట.. ఇక అదే సమయంలో చెన్నై నుంచి ఇంటికి వెళ్లి పోవాలని అనుకున్న ఎస్వీఆర్ ను ఆయన శ్రేయోభిలాషులు మందలించి కష్టాలు పడితేనే జీవితంలో ఎదుగుతారు అని చెప్పి అక్కడే ఉంచారట.. ఇక తినడానికి తిండి లేక ఆఫీసుల చుట్టూ తిరగలేక ఆయన పరిస్థితి అగమ్యగోచరం గా మారిపోయింది.

Telugu Film: Lakshmi Nivaasam (1968) - The Hindu

పోతే కాకినాడలో తనతోపాటు నాటకాలలో నటించిన అంజలీదేవి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి పోతోంది. ఈమెకు తన శ్రేయోభిలాషుల ద్వారా ఎస్వీ.రంగారావు పరిస్థితి తెలిసి చలించి పోయిందట. ఎస్.వి.రంగారావు ను కలిసి ఇంటికి రమ్మని ఆహ్వానించిందట.. ఇక అంజలి దేవి తన ఇంట్లో ఉన్న అయ్యర్ ను పిలిచి ఎస్వీ రంగారావు గారు ఎప్పుడు ఇంటికి వచ్చిన భోజనం పెట్టి మరి పంపించమని ఆర్డర్ వేసిందట.. తిండి లేక అవస్థలు పడుతున్న ఎస్.వి.రంగారావు కు అన్నపూర్ణమ్మ ల అంజలీదేవి కనిపించిందట.Remembering actor-producer Anjali Devi, a stalwart of south Indian films |  The News Minute

ఇక ఆ తర్వాత 1946వ సంవత్సరంలో వరూధిని సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా డిజాస్టర్ కావడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయాడు. తన మేనకోడలు ఇచ్చి వివాహం చేశారు వీరి తల్లిదండ్రులు. సంసారం భారం మీద పడడంతో జంషెడ్పూర్ వెళ్లి ఉద్యోగం చేస్తుండగా..దర్శకుడు సుబ్బారావు ఓ కబురు పంపాడు.ఆ తర్వాత ఆయన నాలుగైదు సినిమాలు చేశాడు.1951లో వ‌చ్చిన పాతాళ‌భైర‌వి సినిమా తన స్థితిని పూర్తిగా మార్చివేసింది.ఆ సినిమా తర్వాత ఎస్వీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.తను చనిపోయేంత వరకు అగ్ర నటుడిగానే కొనసాగాడు