కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

September 24, 2021 at 10:59 am

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే.

Chiranjeevi birthday: 12 of his best songs that made him 'King of Dance' |  Entertainment News,The Indian Express

త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది చిత్ర యూనిట్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు.

Chiranjeevi announces new film 'Bholaa Shankar' on birthday; co-star  Keerthy Suresh shares adorable wish | Regional-cinema News – India TV

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా న‌టించ‌బోతోంద‌ట‌. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తానికి చిరు స‌ర‌స‌న న‌టించ‌బోతున్న త‌మ‌న్నా.. ఆయ‌న సోద‌రిగా చేస్తున్న కీర్తికి వ‌దిన కాబోతుంద‌న్న‌మాట‌.

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts