తెలుగు రాష్ట్రాలలో జాగ్రత్తగా ఉండండి.. అంటూ హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ..?

అల్పపీడన ప్రభావం వలన తెలుగు రాష్ట్రాలపై భారీగా వర్షాలు పడే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.ఆ తరువాత ఇది 48 గంటల్లో మరింత బలపడే వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరిస్తోంది.

రానున్న నాలుగు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వెల్లడిస్తోంది.మంగళవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని మృత్యు కార్లకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.అల్పపీడన బలపడటంతో ఒడిస్సా తీరం వెంబడి గంటకు..55-60 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ కే.కన్నబాబు తెలియజేశారు.

దీని ఫలితంగా ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు మిగతా చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలియజేశారు.ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని వర్షాలు పడే అవకాశాలు ఉన్న జిల్లాలు ఇవే.. విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం రానున్న 24 గంటల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తోంది