RRR.. నుంచి మరో అధికార ప్రకటన విడుదల..?

టాలీవుడ్ లో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాతో మన ముందుకి త్వరలో రాబోతున్న చిత్రం RRR . ఈ సినిమాపై యావద్దేశం ఎదురుచూస్తోంది. అయితే ఈ సినిమా కొన్ని కారణాల చేత వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇక ఈ సినిమాలో మెగా స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్, ఒలివియా మోరీస్, మరొక నటి ఆలియా భట్ నటిస్తున్నది.

ఈ సినిమా కరోనా కేసులు తగ్గడంతో ప్రస్తుతం క్లైమాక్స్ జరుపుకుంటున్నది. ఇక ఈ చిత్రాన్ని అక్టోబర్ 13వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ విడుదల తేదీని మరొకసారి కూడా వాయిదా వేసినట్లు ఈ చిత్ర బృందం తెలియజేస్తోంది. ఇక అంతే కాదు ఈ చిత్రం ఎప్పుడు విడుదల చేయాలన్న విషయం కూడా ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

ప్రస్తుత పరిస్థితులలో ఈ సినిమాని విడుదల చేయలేము అన్నట్లుగా తెలియజేస్తోంది.. అంతే కాకుండా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించలేము అన్నట్లుగా తెలియజేస్తున్నారు. అందుకు ముఖ్య కారణం ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్లు మూత పడడమే అన్నట్లుగా సమాచారం. అందుచేతనే వీరు కొత్త డేట్ ను ప్రకటించడం కరెక్టుగా ఉండదని భావిస్తున్నాము అని తెలియజేసింది ఆ చిత్ర యూనిట్ సభ్యులు..https://twitter.com/RRRMovie/status/1436585188788604936?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1436585188788604936%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftelugu.news18.com%2Fnews%2Fmovies%2Fntr-ram-charan-rajamouli-rrr-release-date-postponed-sr-1027754.html