పవన్ ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరును ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగులో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల పవన్ కళ్యాణ్ ఈ విధంగా ట్వీట్ చేశారు.ఏ పార్టీ అయినా ప్రభుత్వం లోకి రావడానికి రాజకీయం చేయాలి. కానీ అధికారంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు.

దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాకుండా దేశంలోని రాష్ట్రాలకు అలాగే అన్ని వర్గాలకు మార్గదర్శకం స్ఫూర్తిదాయకం. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ లో పవన్ కళ్యాణ్ తెలిపారు. నటుడు చిరంజీవి స్టాలిన్ తో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్ ను కలవడం సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.