తాలిబన్ల నిర్ణయం.. మహిళలకు నరకం..??

ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు సృష్టిస్తున్న అరాచకాలు అంత ఇంతకాదు. వారు చేస్తున్న దుశ్చర్యలకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. తాలిబన్లు చేస్తున్న దారుణాలకి భయపడి ఉన్న దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అక్కడా పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విమానాశ్రయాల్లోకి ప్రవేశించి విమానాల రెక్కలపైన కూర్చుని మరి పారిపోయారంటే తాలిబన్లు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది..
అలాంటి తాలిబన్లు రాజ్యాన్ని పాలించడం మొదలు పెడితే ఇంకా ఎలా ఉంటుందో ఊహించవచ్చు. రాక్షస రాజ్యం,రావణ రాజ్యంలా వీరి పాలనలో మహిళలను అత్యంత దారుణంగా హింసిస్తారంటే వీరు ఎంతకైనా తెగిస్తారని అర్ధమవుతుంది.

అలాంటిది తాము మారిపోయామని గతంలో లా కాకుండా ఇప్పుడు పూర్తి భిన్నంగా ఉంటూ హింసకు తావులేకుండా పరిపాలిస్తామని నీతులు అల్లుతున్నారు. అలంటి వారి మాటల్లో చెప్పిన వాటికి, చేతలకు ఎంత నిజం దాగుందో తెలియడంలేదు. కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నట్టు మహిళకు సంబంధించి వీరు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఇక నుండి మహిళలు, యువతులు అబ్బాయిలతో కలిసి చదువుకోకుండా కో ఎడ్యుకేషన్ సిస్టం ను నిషేధించారు. ఈ నిర్ణయాన్ని గతవారం నుంచే అమలు చేశారు. దీన్ని బట్టి అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చదువుకోకూడదనే నిర్ణయాన్ని ఇక నుండి పాటించాల్సి ఉంటుంది. కనీసం ఉపాధ్యాయులు కూడా మగ వారు ఉండకూడదని నిర్ణయించారు. ఆగనిస్థాన్లో ష రియా చట్టం ప్రకారం ప్రతి విద్యాసంస్థ వారి ఆదేశాలను తప్పక పాటించాలని తాలిబన్లు హెచ్చరిస్తున్నారు.
ఈ నిర్ణయం మహిళలకు ఇదొక శాపంగా మారింది.
దీన్ని బట్టి తాలిబన్ల అత్యంత దారుణమైన పరిపాలన ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు.

ముందు ఇంకా ఎన్ని దారుణాలు చూడాలోనని, కనీసం మహిళలు యువతలు పైచదువులకు దూరం కావాల్సి వస్తుందేమోని పండితులు, విద్యావేత్తలు ఒకింత ఆందోళనలో ఉన్నారు. ఈ విసియం తెలిసిన ప్రతి ఒక్కరు ఆఫ్ఘనిస్తాన్ మహిళలను చూసి అయ్యోపాపమ్ అంటున్నారు.