బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాన‌స్‌కు, బాల‌య్య‌కు మ‌ధ్య సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదహారో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కోయిలమ్మ ఫేమ్ మాన‌స్‌కు, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ సంబంధం ఉంద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, అది రియ‌ల్ సంబంధం కాదండోయ్ రీల్ సంబంధ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలేనికి చెందిన నాగులాపల్లి వెంకటరావు కుమారుడు నాగులాపల్లి మానస్ ఎంటెక్‌ చదివాడు.

 ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అత్యంత స్పెషల్ పోటీదారులలో ఒకరిగా చెప్పుకోవచ్చు. అతను 2001 తెలుగు సినిమా నరసింహ నాయుడుతో బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. అతని అసాధారణ నటనకు ప్రతిష్టాత్మక నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు.

కోయిలమ్మ, మనసంతా నువ్వే, దీపారాధన తదితర సీరియళ్లలో న‌టించి బుల్లితెర‌పై మంచి గుర్తింపు తెచ్చుకున్న మాన‌స్‌.. సినీ కెరీర్ స్టార్ట్ అయింది బాల‌య్య సినిమాతోనే. బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు సినిమాలో చిన్నప్పుడు బాలకృష్ణగా నటించాడు. అదే మాన‌స్‌కు తొలి చిత్రం. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో బాలనటుడిగా నటించిన మాన‌స్‌.. ఝలక్‌, హీరో సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు.

Bigg boss telugu 5: తొలి వారం ఓటింగ్ లో మానస్ దూకుడు.. అతడి గురించి ఈ విషయాలు తెలుసా?– News18 Telugu

హీరో సినిమాకు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. అలాగే గోలీసోడా, కృష్ణం వందే జగద్గురుం, ప్రేమికుడు, గ్యాంగ్‌ ఆఫ్‌ గబ్బర్‌ సింగ్‌, కాయ్‌ రాజ్‌ కాయ్‌ వంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి స్టైలిష్‌గా ఎంట్రీ ఇచ్చిన మాన‌స్‌..తొలి వార‌మే ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యాడు. అయితేనేం.. ఓటింగ్‌లో యాంక‌ర్ ర‌వితో పాటు మాన‌స్ దూసుకుపోతూ అత్య‌ధిక ఓట్లను ద‌క్కించుకుంటున్నాడ‌ట‌. ఇక బాల‌య్య‌ సినిమాతో మాన‌స్ కెరీర్ ప్రారంభించ‌డం వ‌ల్ల‌..నంద‌మూరి అభిమానులు సైతం ఆయ‌న‌కు స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది.