లీడర్ 2 సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించబోతున్నాడ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రానా కెరీర్ కు ఇది ఒక మంచి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. ఇక బాహుబలి సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాహుబలి సినిమాలో హీరో ప్రభాస్ కి దీటుగా విలన్ పాత్రలో నటించి భల్లలదేవ పాత్రలో నటించారు. ఈ పాత్ర కూడా రానాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇది ఇలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా నటించిన మొదటి చిత్రం లీడర్. అప్పట్లో మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా లీడర్ 2 సినిమాను తెరకెక్కించాలని అన్న ఆలోచనలో శేఖర్ కమ్ముల ఉన్నట్లు తెలుస్తోంది. సీక్వెల్ ను మాత్రం సరి కొత్త ఫార్మాట్ లో తీస్తారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. అయితే అప్పట్లో తారాస్థాయిలో చర్చలు జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం ఈ సినిమా ఊసే ఎత్తడం లేదు. ఎప్పటికైనా లీడర్ సినిమాకు సీక్వెల్ గా లీడర్ 2 సినిమా తీయాలనే ఆలోచనలో దర్శకుడు శేఖర్ కమ్ముల ఉన్నట్లు తెలుస్తోంది.