ఆ స్టార్ హీరో కూతుళ్ల‌తో రానా మంత‌నాలు..కార‌ణం ఏంటో..?

September 18, 2021 at 11:19 am

ద‌గ్గుబాటి వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన రానా.. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టించిన `విరాటపర్వం` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా.. మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో క‌లిసి భీమ్లా నాయ‌క్ చిత్రంలో న‌టిస్తున్నాడు.

London Return Shruti Haasan is in Quarantine, Dad Kamal Haasan, Mom &  Sister Isolate in ...

సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. రానా తాజాగా సీనియ‌ర్ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూతుళ్లు అయిన శృతి హాసన్ మరియు అక్షర హాసన్‌ల‌ని క‌లిసి మంత‌నాలు జ‌రిపాడు.

అందుకు సంబంధించిన ఫొటోను శృతి హాసన్ షేర్ చేసి ఒక మంచి స్నేహితుడితో టైమ్ స్పెండ్ చేశాం అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇంత స‌డెన్ గా వీరు మీట్ అవ్వ‌డానికి కార‌ణం ఏంటా..? అన్న చ‌ర్చ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా.. క్రాక్‌, వ‌కీల్ సాబ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌ను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్ర‌స్తుతం స‌లార్ చిత్రంలో న‌టిస్తోంది.

ఆ స్టార్ హీరో కూతుళ్ల‌తో రానా మంత‌నాలు..కార‌ణం ఏంటో..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts