తెలుగు ‘హనుమాన్ ‘అడ్వెంచర్ టీజర్ వచ్చేసింది !

September 18, 2021 at 11:43 am

హీరో నాని నిర్మాతగా మారి తీసిన ‘అ’ సినిమాతోనే విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తన రెండో సినిమాగా సీనియర్ హీరో రాజశేఖర్ తో కల్కి అనే సినిమా తీసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. కల్కి ఓ మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ప్రశాంత్ తెలుగు తెరపై మొదటిసారిగా జాంబిల కాన్సెప్ట్ తో జాంబి రెడ్డి అనే సినిమా తీసి విజయాన్ని అందుకున్నాడు.

జాంబిల కథకు రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకొని సినిమాను ఆకట్టుకునేలా మలిచాడు. ఈ సినిమా ద్వారానే తన సన్నిహితుడైన తేజ సజ్జను హీరోగా పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇదే కాంబినేషన్లో తొలి ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రారంభమైన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెలుగు,తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నాడు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇవాళ హనుమాన్ మూవీ నుంచి ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. తేజ సజ్జ అడవిలో క్యాట్ బాల్ చేతపట్టుకొని వేటాడడం ఈ టీజర్ లో కనిపిస్తుంది. ఈ టీజర్లో తేజ లుక్ ఆకట్టుకునేలా ఉంది. కొండల వెంట పరిగెడుతూ చాలా హుషారుగా కనిపించాడు తేజ. క్యాస్టూమ్స్ కూడా తేజ గెటప్ కి సూటయ్యేలా ఉన్నాయి.

హనుమంతు ఫస్ట్ లుక్ టీజర్ విడుదల సందర్భంగా ‘అంజనాద్రి కొండల నుంచి హనుమంతుడు వచ్చేశాడు ‘ అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. మొత్తానికి ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ ఫస్ట్ లుక్ టీజర్ తోనే అందర్నీ మెప్పించారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత అందరినీ ఆకట్టుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

తెలుగు ‘హనుమాన్ ‘అడ్వెంచర్ టీజర్ వచ్చేసింది !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts