PSPK 28: ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన హరీష్ శంకర్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న ఒకే చెప్పిన ద‌ర్శ‌కుల్లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్క‌బోయే చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ నిర్మించ‌బోతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఆ రోజున పవన్ ఫ్యాన్స్ కి ట్రిపుల్ ధమాకా .... ??

ప‌వ‌న్ కెరీర్‌లో 28వ రూపుదిద్దుకోనున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఈ రోజు ప‌వ‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆయ‌న అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. తాజాగా జాతర షురూ అంటూ ఈ మూవీ ప్రీ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో బైక్ పై స్టైలిష్‌గా కూర్చొని .. బ్యారెల్ గన్‌ను లోడ్ చేస్తూ ప‌వ‌న్ క‌నిపిస్తున్నాడు.

Image

పోస్టర్ వెనక ఇండియా గెట్‌ను కూడా చూపించారు. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ ప్రీ లుక్‌ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ప్రీ లుక్ పోస్ట‌ర్‌లో పవన్ ను మొత్తంగా చూపించక‌పోయిన‌ప్ప‌టికీ.. సగం లుక్కుతోనే హరీష్ శంకర్ అభిమానుల కడుపు ఫుల్లుగా నింపేశాడు. ఇక హీరోయిన్, టైటిల్‌ వివరాల్ని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు.