తన పెళ్లి నాటి సంగతులను తెలియజేసిన ఎన్టీఆర్..?

టాలీవుడ్లో తనదైన శైలిలో హీరోగా రాణిస్తున్న వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు.ఈయన వెండితెరపై బుల్లితెరపై మంచి నటుడిగా పేరు సంపాదించాడు.ఇక ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి వచ్చిన గేస్ట్ లను కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మరింత ఎనర్జీని నింపుతున్నాడు ఎన్టీఆర్. ఇక అలాగే తన ఫ్యామిలీ లైఫ్ లో జరిగిన కొన్ని ముచ్చట్లను కూడా చెప్పుకొస్తున్నాడు. అలా తన పెళ్లి నాటి సంగతులను కొన్ని తెలియజేశారు వాటి వివరాలు చూద్దాం.Jr NTR Tie Knot With Lakshmi Pranathi: Wedding Highlights | Indian  Celebrity Events

ఎన్టీఆర్ ని ఒక గెస్ట్ ఇలా అడిగాడు..మీది పెద్దలు కుదిర్చిన వివాహం కదా..మీరు ఓకే చెప్పడానికి ఎందుకు నెల టైం తీసుకున్నారు అని అడిగాడు ఎన్టీఆర్ ని. ఎన్టీఆర్ తన పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవిడ అసలు మాట్లాడటం లేదట.. కానీ ఎన్టీఆర్ కు ప్రణీత నచ్చి ఎస్ అని చెప్పి వెళ్ళిపోయాడట.ప్రణీత మాత్రం ఎన్టీఆర్ కు ఎస్ అని చెప్పలేదట.

ఇక ఎన్టీఆర్ కు ప్రణీత ఎస్ ఆర్ నో చెప్పకపోవడంతో మా పెళ్లి 8 నెలల గ్యాప్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.ఆ 8 నెలలో ఆమె కేవలం ఒక్కసారి మాత్రమే ఎస్ అని చెప్పింది అని చెప్పుకొచ్చాడు.అందుకనే ఆడవాళ్ళు ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని ఫన్నీ గా చెప్పాడు ఎన్టీఆర్