మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?

September 9, 2021 at 1:57 pm

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతోంది.ఇక మొన్న తాజాగా బండ్ల గణేష్ కూడా జనరల్ సెక్రటరీ పదవికి జీవితకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ప్రకటించాడు.ఇక అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజు నటిస్తున్నాడు.ఇక తాజాగా బాబు మోహన్ కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని తెలియజేశాడు.

బాబు మోహన్ ఈ మధ్య కాలంలో సినిమాలలో నటించడం లేని సంగతి మనకు తెలిసిందే.బాబు మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయనున్నట్లు సమాచారం.అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి ఈ పదవికి శ్రీకాంత్ పోటీ చేస్తున్నాడు.కానీ బాబు మోహన్ మాత్రం తాను ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తా అన్నట్లుగా వినిపిస్తోంది.

లేదా మంచు విష్ణు ప్యానల్ పై పోటీ చేసేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై బాబు మోహన్ ఒక ఇంటర్వ్యూ ఛానల్ లో కొన్ని విషయాలను తెలియజేశాడు.ఇక మూవీ ఎలక్షన్ల గురించి మాట్లాడుతూ కొన్ని చీడపురుగుల వల్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో చాలా రచ్చరచ్చగా మారుతుంది అని తెలియజేశాడు.

చిరంజీవి,దాసరి నారాయణ రావు గొడవలు లేకుండా ఎలా మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిపారో.. అలా జరిగేందుకు కృషి చేస్తున్న అని తెలియజేశారు.

మా ఎలక్షన్ లో గట్టి పోటీకి సిద్ధమవుతున్న కమెడియన్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts