” లవ్ స్టోరీ ” పబ్లిక్ టాక్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన చిత్రం లవ్ స్టోరీ. ఈ సినిమా ఈ రోజున విడుదలై మంచి సక్సెస్ బాటలో నడుస్తున్నది.ఈ సినిమా అచ్చమైన పల్లెటూరి కథ తో సాగే చిత్రంగా తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల. లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి జనాలలో విశేష ఆదరణ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇక ఇందులో నాగచైతన్య ఎంతో అద్భుతంగా నటించాడు, సాయి పల్లవి డాన్స్ తో ప్రేక్షకులను అలరించింది అన్నట్లుగా కొంత మంది సినిమా వ్యూవర్స్ తెలియజేస్తున్నారు. లైఫ్ లో మనకు ముఖ్యంగా ఆనందమే కావాలి.. అలాంటి ఆనందం కోసం ఈ సినిమా చూస్తే సరిపోతుంది అన్నట్లుగా కొంత మంది వ్యూవర్స్ తెలియజేస్తున్నారు.

ఇక లవ్ స్టోరీ సినిమాకు వచ్చిన అమ్మాయిలు.. ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో జరిగే టువంటి సంఘటనల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా లవ్, ఈగో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా తెరకెక్కించారు అన్నట్టుగా కొంతమంది తెలియజేస్తున్నారు. ఇక ఈ సినిమాకి హైలెట్ మ్యూజిక్ అని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

లవ్ స్టోరీ సినిమా ఫ్యామిలీతో కలసి చూసేటట్టుగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్గా ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది అని చెప్పుకోవచ్చు. అంతేకాదు నాగచైతన్య సినీ కెరీర్లో ఇదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని కూడా చెప్పవచ్చు.