మందు కొడుతూ సీరియ‌స్‌గా ఆలోచిస్తున్న కార్తికేయ‌..మ్యాట‌రేంటంటే?

`ఆర్ఎక్స్ 100` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన‌ యంగ్ & టాలెంటెడ్ హీరో కార్తికేయ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్న కార్తికేయ‌.. `నాని గ్యాంగ్ లీడర్` మూవీలో విల‌న్‌గా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

Telugu star Karthikeya to play the villain in Valimai? | Tamil Movie News -  Times of India

ప్ర‌స్తుతం ఈయ‌న రాజా విక్రమార్క సినిమాలు న‌టిస్తున్నాడు. అలాగే త‌మిళ స్థార్ హీరో త‌లా అజిత్, డైరెక్ట‌ర్ హెచ్.వినోద్ కాంబోలో తెర‌కెక్కుతున్న వాలిమై చిత్రంలో కార్తికేయ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. అయితే నేడు కార్తికేయ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపుతూ వాలిమై యూనిట్ ఫస్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది.

Image

ఈ లుక్‌లో ఓ చేతిలో విస్కీ బాటిల్.. మరో చేతిలో వాకీ-టాకీ పట్టుకొని సీరియ‌స్‌గా ఆలోచిస్తూ కార్తికేయ క‌నిపిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటున్న ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఈ మ‌ధ్యే కార్తికేయ లోహిత అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈయ‌న పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నాడు.

Share post:

Latest