పెళ్లి పీట‌లెక్క‌బోతున్న పూజా హెగ్డే.. వ‌రుడు ఆ హీరోనే అట‌..?

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

Pooja Hegde : Biography, wiki, age, height, boyfriend, net worth, movies, info

ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు విష‌యం ఏంటంటే.. పూజా హెగ్డే త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతోంద‌ట‌. ఈ బుట్ట‌బొమ్మ‌ను పెళ్లాడ‌బోయే వ‌రుడు బాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో అట‌. ఎప్ప‌టి నుంచో పూజా ఆ హీరోతో సీక్రెట్‌గా ప్రేమాయ‌ణం న‌డిపిస్తుంద‌ని.. ఇప్పుడు అత‌డినే వివాహం చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

Pooja Hegde tests positive for COVID-19, isolates self | Entertainment

వీరి వివాహానికి ఇరు కుటుంబ స‌భ్యులు సైతం గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌. అందుకే త్వ‌ర‌గా పెళ్లి చేసుకుని.. ప్రియుడికి భ‌ర్త పోస్ట్ ఇచ్చేయాల‌ని పూజా ఆరాట‌ప‌డుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు, పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేయాల‌ని బుట్ట‌బొమ్మ డిసైడ్ అయింద‌ట‌. మ‌రి పూజా పెళ్లి ప్ర‌చారంలో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది.