దమ్ము కొడుతూ షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ భామ‌లు..వైర‌ల్‌గా అన్‌సీన్ వీడియో!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభమైంది. ఆదివారం అట్ట‌హాసంగా స్టార్ట్ అయిన ఈ షో.. కేవ‌లం రెండు రోజుల‌కే రంజుగా మారిపోయింది. దాంతో రాత్రి అయ్యిందంటే చాలు ప్రేక్ష‌కుల‌కు టీవీల‌కు అతుక్కుపోతూ షో టైమ్ కోసం ఈగ‌ర్‌గా వెయిట్ చేసేస్తున్నారు.

Bigg Boss Telugu Season 5: Only 3 Contestants Are Popular

ఇదిలా ఉంటే.. బిగ్‌బాస్ హౌస్‌లో ద‌మ్ముకొట్టే అమ్మాయిలు చాలా అరుదుగా క‌నిపిస్తుంటారు. ఎప్పుడో సీజ‌న్ 1లో ముమైత్ ఖాన్ ను అలా చూశాము. ఆ త‌ర్వాత ఏ సీజ‌న్‌లోనూ ఎవ‌రూ ద‌మ్ము కొడుతూ క‌నిపించ‌లేదు. అయితే తాజా సీజ‌న్‌లో మాత్రం ఇద్ద‌రు భామ‌లు స్మోకింగ్‌ జోన్‌లో దర్శనమిచ్చి షాక్ ఇచ్చారు.

Bigg Boss 5 Telugu: Sarayu And Hamida Are Busy In Smoking Zone With Lobo

ఇంత‌కీ ఆ భామ‌లు ఎవ‌రో కాదు హమీదా, సరయూ. లోబోతో కలిసి ఈ ఇద్దరు బ్యూటీలు దమ్ము లాగుతూ కనిపించారు. గుప్పుమని పొగలు వదులుతూ ఇంటి ముచ్చట్లను ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన అన్‌సీన్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు.. వారిద్ద‌రిపై ట్రోల్స్ చేస్తూ సోష‌ల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు.

https://www.instagram.com/p/CTglDF-JCrr/?utm_source=ig_web_copy_link

 

https://youtu.be/WB0z4D8MIzc